బ్రేకీవెన్ లేదన్నారు.. కానీ సీన్ కట్ చేస్తే లాభాలు ఇచ్చిన ఏకైక హీరోగా ఎన్టీఆర్.!

NTR gave a solid  : తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి హీరోల్లో ఒక్కొక్కరికి ఒకో రకమైన మాస్ క్రేజ్ ఉంది. అయితే ఈ క్రేజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. అయితే ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నా కూడా తన బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ మరియు సినిమాలకి వచ్చే వసూళ్ల పరంగా మాత్రం ఒక రిమార్క్ ఇతర హీరోల అభిమానుల నుంచి ట్రోల్స్ చాలానే ఉన్నాయి.

దీనితో ఎన్టీఆర్ సినిమాలు హిట్ అయినా కూడా 100 కి 100 శాతం బ్రేకీవెన్ అవ్వవు అనే మచ్చ ఉంది. అయితే వీటి అన్నిటికి మాత్రం ఎన్టీఆర్ ఈ ఏడాది అందరికీ తన లేటెస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమాలో ఒకింత రామ్ చరణ్ రోల్ డామినేషన్ ఉన్నా ఎన్టీఆర్ పాత్ర కూడా ఎక్కడా తక్కువ కాదు.

కానీ బయట మాత్రం సినిమా హంగామాలో చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన సందడి చరణ్ ఫ్యాన్స్ కన్నా ఒకింత ఎక్కువే సో ఈ క్రెడిట్ మాత్రం వాళ్ళకి దక్కుతుంది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా భారీ వసూళ్లతో అనేక లాభాలు తెచ్చి పెట్టింది. బ్రేకీవెన్ కూడా అయ్యింది. అప్పుడు ఈ ఏడాదిలో ఇద్దరికీ క్రెడిట్ ఇవ్వాలి కదా అంటే కుదరదు.

చరణ్ నటించిన మరో సినిమా ఆచార్య భారీ ప్లాప్ అయ్యింది. ఇది అనే కాకుండా దీనిపై ముందు తర్వాత వచ్చిన కొన్ని నోటెడ్ సినిమాలు ఆ హీరోలు కూడా ఓవరాల్ బ్రేకీవెన్ ని కొట్టలేకపోయారు. ఏపీ తెలంగాణాలో చూస్తే ఎక్కడో ఒక చోట్ల నష్టాలే ఆ హీరోకి మిగిలాయి.

సో ఈ లెక్కన ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మాత్రం ఎన్టీఆర్ ఒక్కడే బ్రేకీవెన్ ఉన్న హీరోగా నిలిచాడు అని చెప్పాలి. మిగతా హీరోలు నాగార్జున గాని చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ గాని వేరే ఏ హీరోలు కూడా బ్రేకీవెన్ అందుకోలేకపోయారని ప్రూవ్ అయ్యింది. మొత్తానికి అయితే అందరి హీరోల అభిమానులకి కూడా ఎన్టీఆర్ సాలీడ్ ఆన్సర్ ఇచ్చాడు.