తారక్ గురి తప్పలేదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్

NTR fans upset with RRR team
NTR fans upset with RRR team
 
ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి కొమరం భీమ్ తాలూకు ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. చెప్పినట్టే పోస్టర్ ఇంటెన్స్ గా ఉంది.  బల్లెం పట్టుకున్న తారక్ బ్యాక్ గ్రౌండ్లో ఉరుముల మెరుపుల ఆకాశం మంచి ఎలివేషన్ ఉంది పోస్టర్లో.  పోస్టర్ అయితే చాలా బాగుంది. అభిమానులకు చాలా బాగా నచ్చింది. పోస్టర్ వరకు అందరూ సంతృప్తిగానే ఉన్నా ఒక అసంతృప్తి మాత్రం వారిని వెంటాడుతోంది.  ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.  అందుకే అభిమానులు ఎక్కువగా ఆశించారు.  
 
చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేస్తామనే చెప్పారు.  కానీ ఫ్యాన్స్ మాత్రం మోషన్ పోస్టర్ ఉంటుందేమో అని ఆశపడ్డారు.  మొదట్లో వచ్చిన భీమ్ పోస్టర్ తరహాలోనే ఒక మోషన్ పోస్టర్ వదులుతారని, అందులో సినిమా రిలీజ్ డేట్ కూడ మెన్షన్ చేస్తారని అనుకున్నారు.  కానీ అవేమీ జరగలేదు.  ఒట్టి పోస్ట్ మాత్రమే వదిలారు.  అది కూడ రిలీజ్ డేట్ లేకుండా.  దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.  ఎంతో ఆశపడితే జస్ట్ పోస్టర్ వదిలి సరిపెట్టారే అంటున్నారు.  ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే ముందుగా అనుకున్న మేరకు ఈ ఏడాది దసరాకు సినిమా వచ్చే సూచనలు అస్సలు కనిపించట్లేదు. 2021 సంక్రాంతికి లేదా వేసవికి వాయిదాపడేలా ఉంది.