NTR: అదిరిపోయిన ఎన్టీఆర్ – బుచ్చిబాబు సినిమా టైటిల్..!

NTR:యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా పూర్తి కావడంతో తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టి సారిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 35వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయగా 31వ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమా ద్వారా శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కొందరు కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని భావించగా మరికొందరు తారక్ ఈ సినిమాలో ఖోఖో కోచ్‌గా కనిపించనున్నారని భావిస్తున్నారు.ఈ విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ చిత్రానికి “పెద్ది” అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి పెద్ది అనే టైటిల్ పోస్టర్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఈ సినిమాకి సంబంధించిన ఈ విషయాలన్నింటిని గురించి చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ ఫిబ్రవరి 7వ తేదీ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.పూజా కార్యక్రమాల తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.