జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్.. ఎన్ని కోట్లో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ అగ్ర హీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా తాజాగా ఆయన నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఎన్టీఆర్ కార్ల విషయంలో కానీ లేదా వాచ్ వంటి పలు వస్తువులను ఎంతో ఖరీదు చేసి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ఎంతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ తో తీర్చిదిద్దారు.ఇలా వారి అభిరుచులకు అనుగుణంగా తన డ్రీం హౌస్ కొనుగోలు చేసిన ఎన్టీఆర్ కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.

ఈ విధంగా ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఎంతో లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు. అందుకే ఖరీదైన కార్లు బంగ్లాలను కొనుగోలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ హైదరాబాద్లో మాత్రమే కాకుండా బెంగళూరు వంటి నగరాలలో కూడా ఆయనకు ఎంతో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ఎన్టీఆర్ పలు చోట్ల పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ లో ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఈ ఇల్లు హీరో రామ్ చరణ్ ఇంటికి సమీపంలోనే కొనుగోలు చేశారు.