NTR Mother: ఆ విషయంలో ఎన్టీఆర్ ను హెచ్చరించిన తన తల్లి.. ఇలాంటివన్నీ సినిమాలలో మాత్రమే జరుగుతాయి అంటూ..?

NTR Mother: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు గల కారణం తన తల్లి అని చెప్పడంలో ఏమాత్రం సంకోచం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటుడిగా ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుని ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో విడుదల చేశారు.ఈ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హీరో అజయ్ దేవగన్ గురించి మాట్లాడుతూ అతని పై ప్రశంసలు కురిపించారు. అజయ్ దేవగన్ నటనని చూస్తూ చిన్నప్పటి నుంచి పెరిగానని ఆయనని తన గురువుగా భావిస్తారని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

అజయ్ దేవగన్ నటించిన పూల్ ఔర్ కాంటే సినిమాలో అజయ్ దేవగన్ చేసిన స్టంట్ ఇప్పటికీ తన మైండ్ లో మెదులుతూనే ఉందని, ఆ సినిమాలో ఈ హీరో ఒకేసారి రెండు బైక్స్ పై చేసిన స్టంట్ తనకెంతో నచ్చిందని అలా తనకు చేయాలని అనిపించిందనే విషయాన్ని తన తల్లితో చెప్పారు.ఇలా తన కోరికను చెప్పినప్పుడు ఎన్టీఆర్ తల్లి తనని హెచ్చరించినట్లు ఈ సందర్భంగా మీడియా ముందు తెలిపారు. ఇలాంటివన్నీ కేవలం సినిమాలలో మాత్రమే జరుగుతాయి నిజజీవితంలో చేయడానికి ఆస్కారం ఉండదని తనని హెచ్చరించిందనీ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలియజేశారు.