“ఎన్టీఆర్ 31” ఫస్ట్ లుక్ పక్కన పెడితే నీల్ మావ మాత్రం మారడా..?

Ntr 31

Ntr 31 : ఈరోజు మే 20 టాలీవుడ్ సెన్సేషనల్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానులు నిన్న సాయంత్రం నుంచే హంగామా మొదలు పెట్టేసారు. ఇక ఇది పక్కన పెడితే ఈరోజు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల ఫస్ట్ లుక్ లు ప్రీ లుక్ లు ఒకొకటిగా వస్తున్నాయి. మరి నిన్ననే దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న తన 30వ సినిమాపై మెంటల్ మాస్ అప్డేట్ ని ఇవ్వగా…

ఇక ఈరోజు మరో పాన్ ఇండియన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న 31 వ సినిమాపై బిగ్గెస్ట్ అప్డేట్ ని ట్రీట్ గా ఇచ్చాడు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఏకంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ నే రిలీజ్ చేశారు. దీన్ని కూడా కంప్లీట్ సీరియస్ టోన్ లోనే డిజైన్ చేసి విడుదల చేయగా దీనికి భారీ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ లో మాత్రం ఏమాత్రం కొత్తదనం కనిపించేలా లేదనిపిస్తుంది.

Ntr 31

తన హిట్ సినిమాలు కేజీఎఫ్ అలాగే ప్రభాస్ తో సలార్ సినిమాలు ఎలాగైతే డార్క్ టోన్ లో కనిపించాయో ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా ని కూడా అదే డార్క్ థీమ్ లో డిజైన్ చేసి రిలీజ్ చేసాడు. అయితే ఎన్టీఆర్ తన మాస్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నా నీల్ మావ మాత్రం ఆ డార్క్ మోడ్ నుంచి బయటకు రాడా అంటూ కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమాని కూడా అలాగే తీస్తాడేమో చూడాలి. ఇంకా ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ లపై సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.