Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతో విజయవంతం కావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా దాదాపు 90% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.
ఈ తరుణంలోనే ఈయన మరో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో బిజీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారని ఇటీవల మైత్రి మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ వీలైనంత త్వరగా డ్రాగన్ షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడిని తొందర పెడుతున్నారట.
ఈ ఏడాది చివరికి డ్రాగన్ పూర్తి చేసుకుంటే ఈ ఏడాది చివరిలోనే కొరటాలతో చేయబోయే దేవర సీక్వెల్ కూడా సెట్స్ పైకి వెళ్లాలని తొందర పెడుతున్నట్టు సమాచారం అయితే ఎన్టీఆర్ ఇలా తొందరపాటు చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత చూపించేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన డైరెక్టర్లకు కావలనంత సమయం ఇవ్వకపోతే క్వాలిటీ లోపించే అవకాశాలు ఉంటాయి.
ఇలా చేస్తే సినిమాపై భారీ దెబ్బ పడుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ తొందరపాటు కారణంగా ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకే వీలైనంతవరకు డైరెక్టర్లకు సమయం ఇస్తే మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ ఉంటుందని భావిస్తున్నారు. అయినా ఎన్టీఆర్ డైరెక్టర్లను ఇలా తొందర పెట్టడం వెనుక గల కారణం ఏంటి ఆయన కెరియర్ ప్లానింగ్ ఏంటి అంటూ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.