Ntr: జూనియర్ ఎన్టీఆర్ ను బాబు కరివేపాకులా వాడుకున్నారు…. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!

Ntr: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇలా పార్టీని స్థాపించిన ఎనిమిది నెలలలో నుండి ముఖ్యమంత్రిగా ఈయన విజయం సాధించారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయాలలోను సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన వారసులకి కాకుండా చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్లిపోయాయి. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను చేత పట్టుకొని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు అయితే నందమూరి కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీలో కేవలం బాలకృష్ణ మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియగా హరికృష్ణ వ్యవహరించారు అయితే ఎన్టీఆర్ అనారోగ్యానికి గురి కావడం ఆయన మరణాంతరం చంద్రబాబు నాయుడు హరికృష్ణను పార్టీకి దూరం పెడుతూ వచ్చారు. ఇక ఒకానొక సమయంలో హరికృష్ణను జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు వారిని ఉపయోగించుకున్నారు అనంతరం వారిద్దరిని ఒక కరివేపాకుల తీసి పడేసారని ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక చంద్రబాబు నాకు చాలా మంచి మిత్రుడు అయినప్పటికీ నన్ను కూడా మోసం చేశాడని మోహన్ బాబు చంద్రబాబు గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విధంగా మోహన్ బాబు చంద్రబాబుపై తన మనసులోని మాటను బయట పెట్టడంతో, టిడిపి నాయకులంతా ఫైర్ అవుతున్నారు.. ఆయన వల్లే టీడీపీ ఈ పొజిషన్ లోకి వచ్చిందని, ఆయన లేకుంటే ఇప్పటికీ పార్టీ కనిపించకుండా పోయేదని చంద్రబాబు నాయుడు కావడంతో తెలుగుదేశం పార్టీని అలాగే ఎన్టీఆర్ గౌరవాన్ని కూడా కాపాడుతూ వస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు కామెంట్లు చేస్తున్నారు.