Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ఓ రేంజ్ లో మారుమోగుతోంది. తన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” సక్సెస్ పైగా ఈరోజు చరణ్ పుట్టినరోజు కావడంతో తన పేరు మరింత స్థాయిలో వైరల్ అవుతుండగా ఈ RRR తర్వాత చరణ్ చేస్తున్న మరో భారీ సినిమాపై మాత్రం హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లిందని చెప్పాలి.
ఇండియన్ సినిమా దగ్గర ఒకటి దర్శకుడు రాజమౌళి అలాగే శంకర్ ఇలా ఇద్దరు టాప్ ఇండియన్ డైరెక్టర్స్ తో సినిమా ఏకైక నిలవగా ఇప్పుడు రాజమౌళితో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న శంకర్ తో కూడా అదే రేంజ్ రీసౌండ్ ఇచ్చే ఇస్తాడా, ఇవ్వాలి అని ఇప్పుడు నుంచే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అలాగే దీనితో పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ క్రేజీ కాంబోపై మరింత స్థాయి అంచనాలు పెరిగిపోయాయి. మరి పాన్ ఇండియా లెవెల్లో ఈ భారీ సినిమా ఎలాంటి ఆదరణను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం ఇస్తున్న సంగతి తెలిసిందే.