Bheemla Nayak : ఇక “భీమ్లా నాయక్” విడుదల మర్చిపోవాల్సిందేనా..పవన్ ఇమేజ్ సంగతేంటి?

Bheemla Nayak :  ఆల్రెడీ రిలీజ్ అయ్యిపోయి సూపర్ హిట్ అయ్యిన భీమ్లా నాయక్ రిలీజ్ మళ్ళీ మర్చిపోవడం ఏంటా అనిపిస్తుందా? ఇది చూస్తే మీకే గుర్తుకొస్తుంది. అయితే ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బిగ్గెస్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా “భీమ్లా నాయక్” అని చెప్పాల్సిందే.
ఎన్నో అంచనాలు రచ్చ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఏపీలో మినహా మిగతా అన్ని చోట్లా లాభాల్లోకి వెళ్ళింది. మరి ఈ సినిమా రిలీజ్ మళ్ళీ ఎలా ఆగింది అంటే ఈ సినిమాని అప్పుడు తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
దీనితో అందరిలో మరింత ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ సగం అయ్యిపోయింది. పైగా చిత్ర యూనిట్ నుంచి కూడా ఎలాంటి స్పందన కనిపించడం లేదు దీనితో హిందీలో భీమ్లా నాయక్ రిలీజ్ అని మర్చిపోవాల్సిందే అని చెప్పాలి. అయితే ఇది ఆగిపోవడం పవన్ కి కాస్త దెబ్బే అని చెప్పాలి. ప్రస్తుతం ఏదొక అడుగు వేసి పలువురు స్టార్ హీరోలు పాన్ ఇండియా అడుగు వేస్తున్నారు.
సౌత్ లో పవన్ కి ఎలాంటి డోకా లేదు కానీ హిందీలో తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. దానికి భీమ్లా నాయక్ తో ఓ అడుగు వేసినా తర్వాత “హరిహర వీరమల్లు” తో గట్టి వసూళ్లు అందుకోవచ్చని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడప్పుడే పవన్ ఇమేజ్ అయితే అక్కడ పెరిగే అవకాశం లేదని అనిపిస్తుంది. ఇక భీమ్లా నాయక్ లో సంయుక్త మీనన్ మరియు నిత్య మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా సాగర్ చంద్ర దర్శకత్వం అందించాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు స్క్రీన్  ప్లే,చేర్పులు అందించారు.