Sai Sreeram: తనకు పీసీ గారు అంటే చాలా ఇష్టమని, ఎందుకంటే ఆయన చెప్పే స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుందని ఎఫ్ 3 సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ అన్నారు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొత్తదనాన్ని అన్వేషిస్తూ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక సినిమాని అందంగా అంటే ఎవరైనా తీయగలరు. కానీ దాన్ని మాటలతో, లైటింగ్ తో చూపించడం అనేది చాలా కష్టం ఆయన అన్నారు. అంటే దానికి విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అని ఆయన తెలిపారు. అది కేవలం పీసీ గారి దగ్గరే ఉంటుందని సాయి శ్రీ రామ్ అన్నారు.
ప్రస్తుతం ఆయన ఎఫ్ 3 సినిమాకు పని చేస్తున్నానని సాయి శ్రీరామ్ తెలిపారు. ఎఫ్ 2 సినిమాకి ఎప్పుడు చేస్తున్న ఈ సినిమాకి ఈ మధ్య ఉన్న తేడాలను ఆయన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపారు.
హీరో వెంకటేష్ ను చూసి ప్రస్తుత జనరేషన్ చాలా నేర్చుకోవాలని సాయి శ్రీరామ్ అన్నారు. ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి అనేవి ఆయన నుంచి నేర్చుకోవచ్చు అని సాయి శ్రీరామ్ చెప్పుకొచ్చారు. సెట్లో కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయనే సర్దుకుంటారని, అంత సీనియర్ అయి ఉండి కూడా ఆ పని చేయాల్సిన అవసరం ఆయనకు లేదు కదా అని ఆయన చెప్పారు.