జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మి ప్రస్తుతం వరుస కార్యక్రమాలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి సుడిగాలి సుధీర్ తో కలిసి ఎన్నో స్కిట్ లలో సందడి చేశారు. ఈ విధంగా వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో చాలా మంది వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు. అయితే తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఎన్నో సందర్భాలలో ఈ జంట వారి గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా సుధీర్ తో ఎఫైర్స్ గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమంలో పెళ్లి అయినా వారితో తప్ప మిగిలిన పెళ్లి కాని వారందరితో నాకు లింకు పెట్టారని తెలిపారు.సుధీర్ తోనే కాకుండా చంటి తో కూడా నాకు ఎఫైర్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలు గురించి ఆమె స్పందిస్తూ కేవలం మా అందరిదీ ఒకే ఏజ్ కావడం, అది కాక పెళ్లి కాకపోవడంతో ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం అని తెలిపారు.
ఇకపోతే ఈ వార్తలను విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండేది అని అడగగా అందుకు ఈమె సమాధానం చెబుతూ ఇలాంటి వార్తలను తను చాలా సరదాగా తీసుకుంటానని తెలిపారు.మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఈ విషయాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన తరువాత తనలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని ప్రతి విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోనని ఈ సందర్భంగా రష్మి వెల్లడించారు. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.