Gallery

Home News బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ సినిమానా.. ఇంపాజిబుల్

బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ సినిమానా.. ఇంపాజిబుల్

No Truth In Balakrishna, Kalyan Ram Movie

నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, హరికృష్ణలు ప్రముఖులు. పలు రాజకీయ, కుటుంబ కారణాల వలన ఈ అన్నదమ్ముల నడుమ పొరపచ్చాలు చోటుచేసుకున్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. హరికృష్ణ వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు బాలకృష్ణకు మధ్యన కూడ దూరం ఉంది. ఇది మరీ అంత తీవ్రమైన దూరం కాకపోయినా చిన్నదైతే కాదు. ఏదో ఫ్యామిలీ వేడుకల్లో మినహా వీరు కలుసుకోవడం చాలా అరుదు. బయటే ఇలా ఉంటే వీరు కలిసి సినిమా చేయడం అనేది ఊహించడం కూడ వృథానే అనాలి.

కానీ అప్పుడప్పుడు బాలయ్య, హరికృష్ణ వారసుల్లో ఎవరో ఒకరితో కలిసి వర్క్ చేస్తారనే పుకార్లు మాత్రం పుడుతూనే ఉన్నాయి. తాజాగా కూడ అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణతోపాటు కళ్యాణ్ రామ్ నటిస్తాడని అంటూ వచ్చారు. కానీ అందులో నిజం లేదని తేలింది. స్వయంగా అనిల్ రావిపూడి స్పష్టనిచ్చారు. బాలకృష్ణతో సినిమా చేసే ప్రయత్నం నిజమే కానీ అందులో కళ్యాణ్ రామ్ చేస్తారనేది నిజం కాదని, అసలు ఆ దిశగా తాను ప్రయత్నాలే చేయలేదని రావిపూడి అన్నారు. దీన్నిబట్టి బాలకృష్ణ, హరికృష్ణ వారసులు కలిసి వెండితెర మీద కనిపించడం జరిగేపని కాదని అర్థమవుతోంది.

- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News