షాకింగ్ : “పుష్ప” కి అక్కడ థియేటర్స్ దొరకడం బాగా కష్టం అట.!

No Theaters For Allu Arjun Pushpa In There | Telugu Rajyam

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప” పార్ట్ 1 శరవేగంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటుంది. ఓ పక్క సినిమా షూటింగ్ తో పాటుగా నిన్ననే డబ్బింగ్ వర్క్ కూడా అల్లు అర్జున్ స్టార్ట్ చేసేసాడు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ భారీ లెవెల్లో మన దేశంలో ఉంటుందని అర్ధం అవుతుంది. కానీ యూఎస్ మార్కెట్ లో మాత్రం పుష్ప సినిమా అసలు థియేటర్ లు దొరకడమే బాగా కష్టం అవుతుందని తెలుస్తోంది. దీనికి గట్టి కారణం కూడా ఉంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 17నే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెంచుకున్న హాలీవుడ్ సినిమా “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” కూడా రిలీజ్ ఉంది. దీనితో ఈ సినిమాకి పెద్ద ఎత్తున యూఎస్ లో థియేటర్స్ దక్కుతున్నాయట. అందుకే పుష్ప కి అక్కడ మాత్రం అనుకున్న స్థాయిలో థియేటర్ లు దొరకడం లేదని టాక్. మరి ఇదే నిజం అయితే ఓవర్సీస్ మార్కెట్ లో అల్లు అర్జున్ కి మళ్లీ కష్టమే అని చెప్పాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles