హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఒక మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా మాట్లాడటంతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఒక మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా మాట్లాడటంతో ఇప్పటివరకు ఆయనను అభిమానించిన వాళ్లు సైతం ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు వీడియో కాల్ గురించి స్పందిస్తూ వైసీపీ పరువు తీస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేయడంతో పాటు వైసీపీని కూడా బద్నాం చేస్తోంది.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎంపీలు కానీ చివరకు హిందూపురం వైసీపీ కార్యకర్తలు కానీ గోరంట్ల మాధవ్ కు అనుకూలంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. గోరంట్ల మాధవ్ చెప్పిన విధంగా ఆ వీడియో మార్ఫింగ్ వీడియో అని చెప్పడానికి కూడా వైసీపీ నేతలు ఇష్టపడటం లేదు. ఈ వివాదం గురించి స్పందిస్తే తాము కూడా వివాదాలలో చిక్కుకునే ఛాన్స్ అయితే ఉందని వైసీపీ నేతలు భావిస్తుండటం గమనార్హం.
వైసీపీ మీడియా సైతం గోరంట్ల మాధవ్ ను సమర్థిస్తూ కథనాలను ప్రచురించడానికి భయపడుతోంది. హిందూపురం ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ రిజైన్ చేయాలని చాలామంది కామెంట్లు చేయగా సీఎం జగన్ ఆదేశిస్తే గోరంట్ల మాధవ్ పదవికి రాజీనామా చేయక తప్పదని చెప్పవచ్చు. మహిళా నేతలు గోరంట్ల సభ్యసమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించారని అభిప్రాయపడుతున్నారు.
గోరంట్ల మాధవ్ వీడియో కాల్ విషయంలో వైసీపీ అనుమానాలను వ్యక్తం చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి నష్టం కలిగించే విషయాలకు సంబంధించి జగన్ సీరియస్ గా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. గోరంట్ల మాధవ్ వల్ల వైసీపీ కార్యకర్తలు, నేతలు తల దించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం నుంచి గోరంట్ల మాధవ్ ఏ విధంగా బయటపడతారో చూడాల్సి ఉంది.