మాస్క్ లేకుంటే విమానంలోకి నో ఎంట్రీ: ఢిల్లీ హైకోర్టు

ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరిగిపోవటంతో మరోసారి ఢిల్లీ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజుల నుంచి మాస్క్ లు ధరించడం మానేసిన ప్రజలు మళ్లీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అని ప్రకటించారు. కరోనా రూల్స్ పాటించని వారికి భారీ చిరునామాను వేయాలని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ పేర్కొన్నారు.

ఒకవేళ చేపట్టిన నిబంధనలను పాటించకపోతే అవసరమైతే విమానాలు, విమానాశ్రయాల నుంచి బయటకు బలవంతంగా పంపించాల్సి ఉంటుందని నేరుగా చెప్పేశారు. ప్రస్తుతం పలు చోట్ల లో కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరగడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ముందు జాగ్రత్తలు చేపట్టాలి అని సూచనలు కూడా ఇస్తున్నాయి.