YS Jagan: వైయస్ జగన్ పరువు నష్టం ధావ… ఆ రెండు పత్రికలకు సమన్లు జారీ చేసిన కోర్టు!

YS Jagan: తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్స్ వ్యవహారంపై ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున లంచం తీసుకున్నారని ఈ విషయంపై సిబిఐ ఎంక్వయిరీ చేయాలి అంటూ కొన్ని పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు వార్తలను హైలెట్ చేస్తూ రాసాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్ని వివరాలను పూర్తిగా తెలియజేశారు. చార్జ్ షీట్ లో తన పేరు ఎక్కడ ప్రస్తావించలేదని తెలిపారు. అదానీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్ ను తమ ప్రభుత్వం అత్యంత తక్కువ ధరకే సేకీతో సమస్థతో ఒప్పందం కుదుర్చుకుందని జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారు.

ఇలా అనవసరంగా తన ప్రమేయం లేకుండా తన తప్పు లేకుండా కొంతమంది తన పేరును తరచూ ప్రస్తావనకు తీసుకువస్తూ తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారు తనకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే తాను 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ఈయన వెల్లడించారు. జగన్ ఇచ్చిన సమయం కూడా పూర్తి కావడంతో ఈయన పరువు నష్టం దావా వేశారు.

ఇక తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు వైఎస్‌ జగన్‌. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. అయితే సమన్ల తర్వాత పిటిషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామలు తుడి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేస్తూ.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.