Big Boss Ott: నో కామా, నో పులిస్టాప్ …నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్…. వైరల్ గా మారిన బిగ్ బాస్ ప్రోమో!

Big Boss Ott: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతి పెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఎప్పటికీ తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని త్వరలోనే ఓటీటీలో ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుందని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను, ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా పిక్ పాకెట్ కేసులో భాగంగా కమెడియన్ వెన్నెల కిషోర్ ను ఉరి తీయడం కోసం తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఏదైనా చివరి కోరిక ఉందా అంటూ పోలీసులు అతనిని అడగడంతో తనకు బిగ్ బాస్ చూడాలని ఉందనీ చెప్పటంతో పోలీస్ అధికారులు ఒక గంటే కదా అంటూ తనకు బిగ్ బాస్ చూడటానికి అవకాశం ఇస్తారు.అయితే ఈ కార్యక్రమం ఎంతసేపటికి పూర్తికాకపోవడంతో పోలీసులు సైతం ఈ కార్యక్రమం పై ఆసక్తిని పెంచుకుని అందరూ కలిసి ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తుంటారు.

YouTube video player

అదే సమయంలో నాగార్జున నో కామ, నో పులిస్టాప్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ చివరిలో చెప్తాడు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ టెలికాస్ట్ కానుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక ఈ కార్యక్రమానికి ఇది వరకే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నవారు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.