నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

kavitha kalvakuntla telugu rajyam

  తెలంగాణ రాష్టంలో ఈ దపా జరుగుతున్నా వివిధ ఎన్నికల్లో మొదటి ఎన్నిక నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ రోజే జరుగుతుంది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కరోనా కారణంగా వాటిని వాయిదా వేయటంతో తాజాగా నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాక జరుగుతుంది. కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోని పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లకు టెంపరేచర్ టెస్ట్‌లు, మాస్కు, గ్లౌజులు తప్పనిసరి అని సూచించారు.

kavitha telugu rajyam

 

  ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ తరుపున కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తుంది. ఈ పదవి కాలం 2020 ద్వితీయార్థం వరకు ఉంటుంది. ఇక తాజాగా జరిగే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కవితకు ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి వి. సుభాష్ రెడ్డి. బీజేపీ పార్టీ నుండి లక్ష్మి నారాయణ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ లో మొత్తం 824 ఓట్లు వున్నాయి. స్థానిక డివిజన్స్ లో తెరాస కే ఎక్కువ మెజారిటీ వుంది. దాదాపు 524 ఓట్లు కేవలం తెరాస కి వున్నాయి. మరో 28 దాక ఎంఐఎం పార్టీకి ఉన్నాయి. ఎంఐఎం పార్టీ మద్దతు ఎలాగు తెరాసకి ఉంటుంది.

 ఇక కాంగ్రెస్ పార్టీకి 140 ఓట్లు, బీజేపీ పార్టీ 84 ఓట్లు వున్నాయి. వీరు కాకుండా స్వాతంత్రా అభ్యర్థుల ఓట్లు 66 దాక ఉంటాయి. వీటిలో సగానికి పైగా తెరాస కి వచ్చే అవకాశం వుంది. కావున ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనప్రాయమే అని తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్నికల ధర్మం మేరకు పోటీచేయటం తప్ప గెలుపుకోసం కాదనే విషయం తేటతెల్లం అవుతుంది. అందుకే తెరాస అధినాయకత్వం కూడా నిజామాబాద్ ఉప ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోకుండా స్థానిక నేతలకే దాని బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇందులో విజయకేతనం ఎగరవేసి అదే ఉత్సహాన్ని రాబోయే ఎన్నికల్లో కూడా కొనసాగించాలని తెరాస శ్రేణులు భావిస్తున్నారు…