Prabhas: ప్రభాస్ కారణంగా ఏడవని రోజు లేదు… సంచలన వ్యాఖ్యలు చేసిన నటి!

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో మంచి అభిప్రాయం ఉంది ఆయన షూటింగ్ లొకేషన్లో అందరిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారని అందర్నీ తన సొంత వారిలాగా భావిస్తారని ఇప్పటికే ఎంతోమంది ప్రభాస్ గురించి తెలిపారు.

ఇకపోతే తాజాగా ప్రభాస్ గురించి ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి ప్రభాస్ కారణంగా నేను ఏడవని రోజంటూ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ప్రభాస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికి వస్తే… ఆమె మరెవరో కాదు నటి నిత్యామీనన్. నిత్యామీనన్ అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా డైరెక్టర్ నందిని రెడ్డి బలవంతం మేరకు ఈ సినిమాలో నటించారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో ప్రభాస్ గురించి మీడియా వారు ప్రశ్నించారు దీంతో ప్రభాస్ గురించి నాకు తెలియదు అంటూ ఈమె నిజాన్ని ఒప్పుకున్నారు. ఇలా ప్రభాస్ గురించి తెలియదంటూ కామెంట్లు చేయడంతో అప్పట్లో ప్రభాస్ అభిమానులు నన్ను తీవ్ర స్థాయిలో విమర్శించారని సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి కామెంట్లు చేసేవారు అంటూ ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఇలా తన గురించి వచ్చిన విమర్శలను చూసి ప్రతిరోజు ఏడ్చేదాన్ని అంటూ నిత్యామీనన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.