సాయి పల్లవి వదిలేసింది నిత్యా మీనన్ పట్టేసింది

Nithya Menen To Pair Up With Pawan Kalyan

ఇంతకుముందు హీరోయిన్లు స్థార్ హీరోల సినిమాల్లో ఆఫర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. ఛాన్స్ దొరికింది అంటే ఇట్టే యుటిలైజ్ చేసుకుని స్టార్ హీరోయిన్లు అయిపోయేవారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు భిన్నం. అదృష్టం వెతుక్కుంటూ వచ్చినా బిజీగా ఉన్నామని చెప్పి పంపిస్తుంటారు. అలాంటి హీరోయిన్ సాయి పల్లవి. కథలనే తప్ప హీరోల సంగతి పట్టించుకోని సాయి పల్లవి తన పాత్రకు సినిమాలో నిడివి తక్కువ అంటే అది స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేసేస్తుంది. అలా ఆమె కాదన్న సినిమానే పవన్ కళ్యాణ్ సినిమా.

;అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్లో పవన్ జోడీగా ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. ఒరిజినల్ వెర్షన్లో కథనాయకుడి జోడీ పాత్ర చూసేందుకు బలంగానే ఉంటుంది కానీ కథలో ఆమెకు అంత ప్రాముఖ్యత ఉండదు. అందుకే కాబోలు సాయి పల్లవి నో చెప్పింది. దీంతో నిర్మాతలు నిత్యా మీనన్ వద్దకు వెళ్లారట. నిత్యా మీనన్ కూడ గత కొన్నాళ్లుగా హిట్ లేక ఇబ్బందిపడుతోంది, ఇలాంటి టైంలో ఆమెకు పవన్ సినిమాలో చేయడం మంచి అవకాశమనే అనాలి. అందుకే నిత్యా సైతం నిర్మాతలకు ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. పైగా ఆ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది కూడ.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles