Nithya Menon: అలా ఈజీగా టచ్ చేయడానికి మేము ఆట బొమ్మలమా.. నీ నెటిజన్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన నిత్యామీనన్!

Nithya Menon: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తోపాటు ఇతర భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నిత్యామీనన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. అలా తెలుగు తమిళం కన్నడ భాషల్లో నటించి మెప్పించింది. సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతోపాటు గెస్ట్ రోల్ లో కూడా నటించి మెప్పించింది నిత్యామీనన్. ఇకపోతే ఇటీవల తిరుచ్చిట్రం ఫలం చిత్రంలో ధనుష్‌తో జత కట్టిన ఈమె ఆ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి ధనుష్‌ సరసన నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతికి జంటగా తలైవన్‌ తలైవి చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే నిత్యామీనన్ ముక్కుసూటి మనిషి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ విషయాన్ని అయినా సరే కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ వుంటుంది. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటారు అని ఫీలింగ్ లేకుండా ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటుంది. చాలామంది కూడా ఈమెను ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల ఒక భేటీలో ఈమె మాట్లాడుతూ చాలా మంది మగవారు సగటు మహిళల మాదిరిగా నటీమణులను భావించరు.

నటీమణులను ఈజీగా టచ్‌ చేయవచ్చని భావిస్తారు. మేము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా కరచాలనం అంటూ తమను టచ్‌ చేయడానికి ఎగబడతారు. అదే సాధారణ మహిళలను కరచాలనం అడుగుతున్నారా ? అలా ఈజీగా టచ్‌ చేయడానికి మేము ఏమన్నా ఆట బొమ్మలమా? అని నటి నిత్యా మీనన్‌ ప్రశ్నించారు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. కాగా నిత్యామీనన్ ఇలా మాట్లాడడానికి గల కారణం కొద్ది రోజుల క్రితం నిత్యామీనన్‌ ఓ ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడ ఓఒక అభిమాని ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నిత్యామీనన్ అతనికి నమస్కారం చేసి తనకు జలుబు ఉందని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేదికపై ఉన్న నటుడిని కౌగిలించుకుని చేయి ఇచ్చారు. ఈ వీడియోని షేర్‌ చేస్తూ నిత్యా మీనన్‌ను నెటిజన్స్‌ ట్రోల్‌ చేశారు. దీనికి కౌంటర్గా ఆమె నెటిజన్స్ కి దిమ్మతిరిగే పోయే విధంగా తాజాగా ఆమె వ్యాఖ్యలు చేసింది.