2020 ఎంతో నేర్పంది.. నితిన్ భార్య షాలినీ పోస్ట్ వైరల్

యంగ్ హీరో నితిన్ తన భార్యతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఓ వైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే మరో వైపు హనీమూన్‌ను కూడా కానిచ్చేశాడు. రంగ్ దే, అంధాదున్ సినిమాల కోసం దుబాయ్‌కి వెళ్లిన నితిన్ తన సతీమణిని కూడా వెంట తీసుకెళ్లాడు. అలా అక్కడ ఈ ఇద్దరూ కలిసి ఫుల్ హల్చల్ చేశారు. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది.

Nithin Wife Shalini Kandukuri About 2020 Year
Nithin wife Shalini Kandukuri about 2020 year

అయితే ఈ ఏడాది అందరికీ ఓ గుణపాఠంగా మిగిలిపోయింది. మనిషికి ఏది ముఖ్యం.. ఏది అవసరం.. ఏది అనవసరం వంటి విషయాలన్నే అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. కరోనా వైరస్ మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది. ఇదే విషయాన్ని నితిన్ భార్య షాలినీ చెప్పుకొచ్చింది. పీడ కల లాంటి 2020 ఎంతో నేర్పిందంటూ నితిన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ కామెంట్ చేసింది.

ఈ ఏడాది అంత బాగా లేకపోవచ్చు.. కానీ మంచి చెడు కష్ట సుఖాల్లో ఎలా ఉండాలో ఎంతో నేర్పింది. ఇక ఇప్పటి నుంచి కొత్త ఆశలతో, ఎంతో అందమైన జీవితం మన కోసం ఎదురుచూస్తోందన్నట్టుగా ఎంతో కొత్తగా ఆరంభించాలి.. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. అందరి జీవితాల్లోనూ సుఖసంతోషాలు నెలకొనాలని కోరుకుంటున్నాను అని షాలినీ పోస్ట్ చేసింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles