Hero Nithin: కరోనా బారిన పడిన నితిన్ భార్య.. వైరల్ అవుతున్న ఆమె బర్త్ డే వీడియో..!

Hero Nithin: టాలీవుడ్ లో నితిన్ గురించి తెలియని వారు ఉండరు . జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన జర్నీ మొదలు మొదలుపెట్టారు . ఆ తరువాత నితిన్ నటించిన దిల్ , సై , ఇష్క్ ,గుండెజారి గల్లంతయ్యిందే , అ ఆ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి . నితిన్ చిన్నప్పటినుండి పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని. అయితే తాజాగా హీరో నితిన్ భార్య కరోనా బారిన పడింది.

దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో బాలీవుడ్ లో చాలామంది హీరోహీరోయిన్లు కరోనా బారిన పడ్డారు .టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి . ఇప్పటికే మహేష్ బాబు ,మంచు లక్ష్మి , మంచు మనోజ్ , తాజాగా నితిన్ భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. 2020 సంవత్సరంలో కరోనా నిబంధనలను పాటిస్తూ హీరో నితిన్ , తన ప్రేయసి శాలిని కందుకూరిని వివాహం చేసుకున్నారు. అప్పటినుండి వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉంటూ వారి మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు . అయితే రీసెంట్ గా కరోనా కారణంగా వీరు దూరంగా ఉండవలసి వచ్చింది .

ఈ తరుణంలో నితిన్ తన భార్య శాలిని పుట్టినరోజు వేడుకని డైరెక్ట్ గా కలిసి చేసుకోలేకపోయారు. నితిన్ భార్య హోమ్ క్వారంటైన్ లో ఉంటే నితిన్ తన భార్య కోసం కేక్ కట్ చేసి విషెస్ తెలిపాడు. శాలిని తన ఇంటిలో పైన రూమ్ లో ఉండే కిటికీలోనుంచి చూస్తూ ఉండగా నితిన్ తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు చూపిస్తూ కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశాడు.కరోనాకి హద్దులు ఉండొచ్చేమో కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానని నితిన్ పోస్ట్ చేశాడు . ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అందరూ శాలినికి బర్త్ డే విషెస్ తెలియజేశారు . ఆమె కరోనా నుండి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు .