విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చాలాకాలం ఇండస్ట్రీకి దూరమైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలై భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ద్వారా నితిన్ లాభపొందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే..విక్రమ్ సినిమా ని తెలుగులో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. తెలుగులో విక్రమ్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకు జరిగినట్లు సమాచారం. ఇదివరకు కమల్ హాసన్ నటించిన సినిమాల రిజల్ట్ భట్టి విక్రమ్ సినిమా తెలుగు హక్కులు తక్కువ మొత్తానికి నితిన్ తండ్రి కొనుగోలు చేశాడు. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై ఉన్న నమ్మకంతో నితిన్ తండ్రి ఈ సినిమా రైట్స్ కోనుగోలు చేశాడు. అంతే కాకుండా విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తన నటనతో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాడు. అందువల్ల ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే తెలుగులో 14 కోట్ల రూపాయల బిజినెస్ చెసింది. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ సినిమా ఇప్పటివరకు 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నితిన్ కి విక్రమ్ సినిమా ద్వారా ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ వచ్చింది. మరొక వారం రోజులు పాటు విక్రమ్ సినిమా ప్రభావం తెలుగు బాక్సాఫీస్ పై ఉండే ఉందని సినీ వర్గాల సమాచారం. విక్రమ్ సినిమా కమల్ హాసన్ కి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమ వల్ల వచ్చిన లాభాలతో విక్రమ్ తన అప్పులు అన్ని తీరుస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించాడు.