మార్నింగ్ షో టాక్ : ‘రంగ్ దే’.. నితిన్ గట్టెక్కినట్టే

Nithiin's Rang De morning show talk

Nithiin's Rang De morning show talk

చెక్’ సినిమాతో పరాజయం పొందిన హీరో నితిన్ ‘రంగ్ దే’ చిత్రంతీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే మరోసారి హిట్ ట్రాక్ ఎక్కవచ్చనేది నితిన్ ఆశ. సినిమా మార్నింగ్ షో టాక్ వింటే ఆ ఆశలు నెరవేరినట్టే అనిపిస్తున్నాయి. సినిమా మీద ప్రేక్షకుల్లో మొదటి నుండి కొంచెం పాజిటివ్ బజ్ ఉంది. చిత్ర యూనిట్ అరకొరగా ప్రమోషన్లు చేసింది కానీ ఇంకా గట్టిగా చేసి ఉంటే ఓపెనింగ్స్ ఇంకా ఎక్కువ ఉండేవి. ఈ సినిమాను వన్ సైడ్ లవ్ చేసే ఒక అమ్మాయి కోణం నుండి రాశారు దర్శకుడు వెంకీ అట్లూరి. హీరో హీరోయిన్ ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు. హీరోకు అమ్మాయి అంటే అస్సలు పడదు. అమ్మాయికి హీరో అంటే పిచ్చి.

ఈ థ్రెడ్ పట్టుకుని డైరెక్టర్ మంచి ఎమోషన్ నడిపించారు. కీర్తి సురేష్ పాత్రలో మంచి డెప్త్ ఉంది. ఆమె నటనే సినిమాకు హైలెట్. పాత్రను కీర్తి పుల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తరవాత ఆమెకు పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఇచ్చిన క్యారెక్టర్ ఇది. ఈ అవకాశాన్ని కీర్తి పూర్తిగా సద్వినియోగం చేసుకుని సినిమాను నిలబెట్టింది. నితిన్ నటన కూడ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు కాసేపు నవ్వించి కాసేపు రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లి చివర్లో ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయి.

అస్సలు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఆ అమ్మాయికి తన వలనే ప్రెగ్నెన్సీ వస్తే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎంటెర్టైనింగా చూపించారు. కామెడీ బాగానే పండింది. సెకండాఫ్ పాటలు బాగున్నాయి. సినిమాను మొదలుపెట్టిన విధానం, ముగించిన తీరు బాగున్నాయి. అయితే సినిమాలో చెప్పుకోదగిన బలమైన కథనంతో ఏదీ లేదు. కథనం కూడ కొంచెం ప్రిడిక్టబుల్. అవే సినిమా గ్రాప్ పడేలా చేశాయి. మొత్తంగా చూస్తే ‘రంగ్ దే’ నితిన్ ను గట్టునపడేసే సినిమానే అనాలి.