బ్యాక్ టూ బ్యాక్ ప్రయోగాలు చేస్తున్న నితిన్

Nithiin To Do Experiment With New Director
హీరో నితిన్ ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఆ రెండు చిత్రాలు ‘చెక్, రంగ్ దే’ బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి.  అయినా నితిన్ డీలా పడట్లేదు.  ఈ సంవత్సరం ఇంకో సినిమాతో రావాలని చూస్తున్నారు.  అదే ‘మాస్ట్రో’.  హిందీ ‘అందాధూన్’కు ఇది రీమేక్.  ఇది పూర్తి కాకుండానే ఇంకో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉండనుంది. ‘మాస్ట్రో’ పూర్తికాగానే ఈ చిత్రాన్ని మొదలుపెడతాడట.  ఇది కంప్లీట్ కాగానే చేయాల్సిన సినిమాను కూడ ఇప్పుడే డిసైడ్ చేసి పెట్టుకున్నాడు నితిన్. 
 
ఈసారి ఆయన కొత్త దర్శకుడితో ప్రయోగానికి రెడీ అవుతున్నారట. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు.  అందులో భాగంగానే నితిన్ కు ఒక కథ వినిపించారట. ఆ కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని అడిగాడట నితిన్. ఈ కథ రెగ్యులర్ కథల్లా కాకుండా కాస్త కొత్తగా, ప్రయోగాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.  ఎస్ఆర్ శేఖర్ మంచి ఎడిటర్.  ‘బిజినెస్ మ్యాన్, టెంపర్’ లాంటి సినిమాలకు పనిచేశాడు. ‘మాస్ట్రో’కి కూడ ఆయనే ఎడిటర్.  ఇంతవరకు దర్శకత్వంలో అనుభవం లేదు.  అలాంటి వ్యక్తితో సినిమా అందులోనూ డిఫరెంట్ స్టోరీతో అంటే నితిన్ ప్రయోగం చేస్తున్నాడనే అనుకోవాలి. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles