కార్తీకదీపం రీ ఎంట్రీ పై స్పందించిన నిరుపమ్… నిజంగానే రీ ఎంట్రీ ఇవ్వనున్నారా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఎంతో ఆదరణ సంపాదించుకున్న సీరియల్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి.స్టార్ మా లో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర సీరియల్స్ లో టాప్ వన్ రేటింగ్ కైవసం చేసుకుని దూసుకుపోతున్న ఈ సీరియల్ నుంచి వంటలక్క డాక్టర్ బాబు తప్పుకోవడంతో ఈ సీరియల్ కు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి.అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సీరియల్లోకి డాక్టర్ బాబు, వంటలక్క రీఎంట్రీ ఇస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజంగానే డాక్టర్ బాబు రీఎంట్రీ ఇస్తారా అంటూ చాలామంది సందేహాలను వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ కు దూరమైన నటుడు నిరుపమ్ ప్రస్తుతం తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కాంటెస్ట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా నెటిజన్లు డాక్టర్ బాబు గురించి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాబును ప్రశ్నిస్తూ తదుపరి సీరియల్ ప్రాజెక్ట్ ఏంటి?మీరు నిజంగానే కార్తీకదీపం సీరియల్ లోకి రీఎంట్రీ ఇస్తారా అంటూ పెద్ద ఎత్తున ఈ ప్రశ్న గురించి అడిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తాను సీరియల్స్ లో నటించడం లేదని కానీ సీరియల్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించానని, ఆ వెబ్ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు.ఇక కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఇకపై తాను కార్తీకదీపం సీరియల్ లో ఎక్కడా కనిపించని, ప్రస్తుతం ఈ సీరియల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ అంత పెద్ద పిల్లల చేత డాడీ అని పిలిపించుకోవాలని తనకు లేదని, ఇక ఈ సీరియల్ లో కి ఎట్టి పరిస్థితులలో రీ ఎంట్రీ ఇవ్వని సమాధానం చెప్పారు.