Nirupam Paritala: మా టీవీలో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ప్రేక్షకులకు దగ్గరైన నిరుపమ్ పరిటాల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. భార్యతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేస్తున్నారు. నిరుపమ్ భార్య మంజుల కూడా చాలా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. కొంతకాలంగా సీరియల్స్ కి దూరంగా ఉన్న మంజుల ఇటీవల మళ్లీ సీరియల్స్ లో కనిపిస్తోంది. తరచు యూట్యూబ్ వీడియోలతో సందడి చేసే మంజులని అందరు డాక్టర్ బాబు భార్య అంటూ ఆట పట్టిస్తుంటారు.
మంజుల మూడు నెలల క్రితం” మంజుల నిరుపమ్” అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఈ ఛానల్ ద్వారా నిరుపమ్ తన భార్యతో కలిసి యూట్యూబ్ వీడియోలతో ఎంతో సందడి చేస్తున్నారు. ఈ యూట్యూబ్ వీడియోల ద్వార తమ వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల మదర్స్ డే సందర్భంగా మంజల ఒక వ్లాగ్ చేసింది. తన భర్త నిరుపమ్, కొడుకు రిక్కికి ఆ విషయం గుర్తుందో లేదో అని తెలుసుకునేందుకు మంజుల నానా తంటాలు పడింది.
ఈ వీడియోలో టీవీ చూస్తున్న తండ్రి కొడుకుల వద్దకు వెళ్ళి ఈ రోజు ఏంటి అని అడిగితే సండే అని రిక్కి సమాధానం చెబుతాడు. ఈ రోజు స్పెషల్ ఏంటి? అని అడిగితే.. నాన్ వెజ్ కదా? అని అంటాడు. దీంతో మంజుల తలపట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు వ్లాగ్ చేస్తున్నావ్ అంతేగా …వెళ్ళి నీ వ్లాగ్ చేసుకో… మేము సినిమా చూడాలి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అని అంటారు. దీంతో మంజుల నేను చేసేది మీతోనే అని మంజుల అంటుంది. అందుకు నిరుపమ్ రియాక్ట్ అవుతూ .. వ్లాగ్ చేయటానికి మమ్మల్ని అడిగావా? మా డేట్స్ అడిగావా? మేం ఫ్రీగా లేం..మేం ఇప్పుడు సినిమా చూడాలి అని మంజులకు నిరుపమ్ కౌంటర్లు వేస్తాడు.