Forbes Most Powerful Women: వరుసగా మూడో సంవత్సరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ (Nirmala Sitharaman) 2021 యొక్క శక్తివంతమైన మహిళల జాబితాలో-ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఫోర్బ్స్ సర్వే లో వరుసగా మూడు సార్లు చోటు దక్కించుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు.
ఈ సంవత్సరం 37వ స్థానంలో ఉన్న సీతారామన్, 2020లో జాబితాలో 41వ స్థానంలో మరియు 2019లో 34వ స్థానంలో ఉన్నారు. సీతారామన్ ఈ ఏడాది 39వ ర్యాంక్‌లో ఉన్న US కౌంటర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు ర్యాంక్‌లు ముందున్నారు. HCL కార్పొరేషన్ సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా 52 వ స్థానంలో నిలిచారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా 72 వ స్థానం లో ఉండగా.. భారతదేశపు అత్యంత సంపన్న మహిళా బిలియనీర్ ఫల్గుణి నాయర్ 88 వ స్థానం లో నిలిచారు.