శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో నిఖిల్ సిద్ధార్ద్. ఈయన తప్ప ఆ సినిమాలో నటించిన వారెవరు ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. అయితే హ్యాపీడేస్ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసిన నిఖిల్‌కు ఆరేళ్ల వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో డీలా పడ్డ నిఖిల్‌కు స్వామిరారా చిత్రం మంచి బూస్టప్‌ను ఇచ్చింది. దీంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం సినిమాలు నిఖిల్‌ను ఇండస్ట్రీలో స్థిర పడేలా చేశాయి.
గత ఏడాది తన ప్రేయసి పల్లవిని వివాహం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం తన భార్యతో హ్యాపీమూమెంట్స్ గడుపుతున్నాడు. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌కు కొంత థ్రిల్ కలిగిస్తున్నాడు. అయితే నిఖిల్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కారు కొన్నానంటూ చెప్పుకొచ్చాడు. అయితే కరోనా వలన నా దగ్గరికి రావడానికి కాస్త లేట్ అయింది. అర్జున్ సురవరం హిట్ కావడంతో నాకు నేనుగా గిఫ్ట్‌గా ఈ కారుని ఇచ్చుకున్నాను అని నిఖిల్ స్పష్టం చేశాడు.
నిఖిల్ కొనుగోలు చేసిన కారుపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. రేంజ్ రోవర్ కారు ధర ఎంత ఉండొచ్చు అని ముచ్చటించుకుంటున్నారు. హై-ఎండ్ మోడల్ హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.2.10 కోట్లు కాగా, నిఖిల్ కొనుగోలు చేసిన కారు ధర కోటి రూపాయల పైనే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొదటిది కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ 2 చేస్తున్నాడు. చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘18 పేజస్’ అనే సినిమా కూడా చేస్తున్నారు నిఖిల్. ఈ మూవీలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.
New Range Rover Sport Autobiography…
Was supposed to gift myself for the success of Arjun Suravaram… COVID made it come a little late… #rangeroversport #autobiography #rangerover pic.twitter.com/p5UFfjspJL— Nikhil Siddhartha (@actor_Nikhil) January 24, 2021