అయోధ్య రామ మందిరం నేపధ్యం లో నిఖిల్ సినిమా

నిన్న మొన్నటి వరకు అంతంత గా సాగిన నిఖిల్ కెరీర్ ‘కార్తికేయ 2 ‘ తో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో నిఖిల్ కి హిందీ లో కూడా మార్కెట్ ఏర్పడింది. పాన్ ఇండియా రేంజ్ లో అటు అమెరికాలో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ రావడం విశేషం.

ఈ సినిమా హిట్ అవ్వడంతో ‘కార్తికేయ-3 ‘ సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. దీనిపై స్పందించిన నిఖియిల్ మీడియాతో మాట్లాడుతూ కార్తికేయ-3 సినిమాపై నిఖిల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘నేను ఎక్కడికెళ్లినా ఆడియన్స్ కార్తికేయ-3 గురించి అడుగుతున్నారు. నేను కార్తికేయ-3 చేయకపోతే నన్ను ఎవ్వరూ వదిలేలా లేరు. కార్తికేయ-3 సినిమా అతి తర్వలోనే ప్రారంభం కానుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే, ‘కార్తికేయ-త్రీ’ అయోధ్య ‘రామ మందిరం’ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. దీని పై డైరెక్టర్ చందూ మొండేటి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.