సోనూ సూద్ తరహాలో నిఖిల్ కూడ

Nikhil following Sonu Sood footsteps
Nikhil following Sonu Sood footsteps
నటుడు సోనూ సూద్ కరోనా విపత్తులో ప్రజలకు ఎంతలా సేవలు చేసున్నారో మనం చూస్తూనే ఉన్నాం.  మొదట్లో పేదలకు, వలస కూలీలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఆయన పరిస్థితులు మారడంతో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తన సేవలు అందిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, రేమిడిసివర్ ఇంజక్షన్లు లాంటి అత్యవసర సేవలు అందిస్తున్నారు ఆయన. ఆయన చేస్తున్న సేవలకుగాను దేశం మొత్తం ఆయన్ను కొనియాడుతోంది. సోనూ సైతం రోజురోజుకూ తన సేవలను విస్తరిస్తూ వెళుతున్నారు. 
 
టాలీవుడ్లో కూడ అలాంటి సేవలే చేసే హీరో ఒకరు తయారయ్యారు.  అతనే నిఖిల్.  ఆయన కూడ సోనూ సూద్ మాదిరిగానే సోషల్ మీడియా ద్వారా పనిచేస్తూ తనకు వీలైనంత సహాయం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకుని పనిచేస్తున్నాడు.  ఇప్పటికే అనేక చోట్ల పలువురికి ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రిలో బెడ్లు, మందులు లాంటి అవసరాలను తీరుస్తున్నారు. చాలామంది సహాయం కావాలని నిఖిల్ కు సందేశాలు పంపుతున్నారు.  నిఖిల్ సైతం తన శక్తిమేర వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు.  ఆయన సేవలకు గాను నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.