స్వర్గం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిహారిక… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

నిహారిక కొణిదెల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా గుర్తింపు పొందిన ఈమె బుల్లితెర యాంకర్ గా, నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన ఒక వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్ రావడంతో నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.

ఇక ఈ వ్యవహారం మర్చిపోకముందే నిహారిక పబ్ వ్యవహారంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఒక్కసారిగా నిహారిక వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఈ విధంగా పబ్ వ్యవహారం కారణంగా పోలీసులకు దొరికిన ఈమె కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తిరిగి ఇంస్టాగ్రామ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎప్పటిలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా నిత్యం ఏదో ఒక పోస్ట్ తో అభిమానులను సందడి చేస్తున్నారు.

తాజాగా నిహారిక తన భర్తతో కలిసి జోర్దాన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అక్కడ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. తాను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను అనే విధంగా క్యాప్షన్ జోడించి ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ క్రమంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు.ఈ సందర్భంగా కొందరు నువ్వు కూడా ఆ పిల్లర్ మాదిరిగా ఎంతో బలంగా దృఢంగా ఉండాలి అంటూ కామెంట్ చేయగా, మరికొందరు ఇంకొకసారి పోలీసులకు దొరికితే నిజంగానే నీకు స్వర్గం కనబడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నిహారిక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.