Niharika: తెలుగు సినీ ప్రేక్షకులకు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. మొదట యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారి తన సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. రెండు మూడు సినిమాలలో నటించగా హీరోయిన్ గా అంతగా గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత పెళ్లి చేసుకుని మూడు ముళ్ళు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈమె వైవాహిక జీవితం మూనాళ్ల ముచ్చట అయ్యింది.
పెళ్లి అయిన మూడేళ్లకే చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత తరచూ ఏదోక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది మెగా డాటర్. ఇది ఇలా ఉంటే నిహారిక ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యింది. దాంతో ప్రస్తుతం ఇదే బాటలో పయనిస్తోంది. కేవలం నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా నటిగా కూడా సినిమాల్లో నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు రెండోసారి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది నిహారిక. నిహారిక నిర్మాతగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, వసిష్ఠ, కళ్యాణ్ శంకర్ గెస్టులుగా హాజరయ్యారు. ప్రస్తుతం సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రెండవసారి నిర్మాతగా సినిమాను తెరకెక్కించబోతున్న నిహారికకు ఎలాంటి ఫలితం కలుగుతుందో చూడాలి మరి. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా సక్సెస్ అవ్వాలని మంచి ఫలితాలు రావాలి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.