Raakaasaa: సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతోన్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపుని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రాబోతోన్నారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘రాకాస’ గ్లింప్స్ వదిలి అందరిలోనూ చిత్రం మీద ఆసక్తిని రేకెత్తించారు.
‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ సాగింది. అయితే ఆ తరువాత ఒక్కసారిగా అది కామెడీ, సెటైరికల్ టర్న్ ఇచ్చుకుంది. ఇక ఇందులో సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ మెప్పిస్తాడని, అందరినీ ఆకట్టుకుంటాడని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశారు.
ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కథతోనే మరో ప్రయోగం చేస్తున్నట్టుగా ఈ గ్లింప్స్ చెబుతోంది. ఇక ఇందులో సంగీత్ శోభన్ తనలోని మరో కోణాన్ని చూపించేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలం అని ఈ గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. కామెడీతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్తదనాన్ని చూపించేలా కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ అమ్మ, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు
సాంకేతిక వర్గం: బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్, l నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్ l కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మానస శర్మ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్ l ఆడిషన్ స్క్రీన్ ప్లే: మహేష్ ఉప్పాల l సంగీతం: అనుదీప్ దేవ్ l సినిమాటోగ్రాఫర్: రాజు ఎదురోలు l యాక్షన్ కొరియోగ్రాఫర్: విజయ్ l ఎడిటర్: అన్వర్ అలీ l ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు l ఆర్ట్ డైరెక్టర్: పుల్ల విష్ణు వర్ధన్ l కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు l పి.ఆర్.ఒ: ఎస్.కె.నాయుడు-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌నర్: యు వుయ్ మీడియా l మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ


