HomeNewsహ‌నీమూన్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్న నిహారిక-చైత‌న్య జంట‌.. వ‌చ్చే నెల‌లో ఫ్లైట్ ఎక్కుతామంటున్న కొత్త దంప‌తులు

హ‌నీమూన్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్న నిహారిక-చైత‌న్య జంట‌.. వ‌చ్చే నెల‌లో ఫ్లైట్ ఎక్కుతామంటున్న కొత్త దంప‌తులు

నిహారిక-చైత‌న్య జంట‌.. ఈ ఏడాది విషాదాల‌తో పాటు శుభాకార్యాలు కూడా బాగానే జ‌రిగాయి. ఇన్నాళ్ళు బ్యాచిల‌ర్స్‌గా ఉన్న సెల‌బ్రిటీలు పోటీ ప‌డీ మ‌రి పెళ్లి పీట‌లెక్కారు. ఒక వైపు హీరోలు, మ‌రో వైపు హీరోలు తమ పెళ్ళి ఫొటోల‌తో అభిమానుల‌కి ఊపిరాడ‌నీయ‌కుండా చేశారు. కొన్నాళ్ళుగా ఊరిస్తూ వ‌చ్చిన కాజ‌ల్ పెళ్ళి చేసుకోవ‌డ‌మే కాకుండా వెంట‌నే హ‌నీమూన్ టూర్‌కి కూడా వెళ్ళింది. అక్క‌డి ఐలాండ్‌లో త‌న భ‌ర్త‌తో క‌లిసి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు హ‌నీమూన్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగించింది.

Niha Chaitu | Telugu Rajyam

ఇక ఇప్పుడు నిహారిక టైం వ‌చ్చింది. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున‌ లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్ ప్యాలెస్ వేదిక‌గా చైత‌న్య‌ని పెళ్లాడిన నిహారిక ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ జ‌రుపుకుంది. అనంతరం అన్న‌వ‌రం, తిరుప‌తి వంటి పుణ్య క్షేత్రాల‌కు తిరుగుతూ వ‌చ్చారు. ఇప్పుడు హ‌నీమూన్ టూర్ టైం రావ‌డంతో ఎక్క‌డికి వెళ‌దాం అనుకుంటున్న ఈ జంట‌కి మాల్దీవులు వెళ్ళాల‌నే ఆలోచన వ‌చ్చింద‌ట‌. ఆ మ‌ధ్య కాజ‌ల్‌, ప్ర‌ణీత‌, ర‌కుల్, స‌మంత వంటి భామ‌లు అంద‌రు అక్క‌డ ర‌చ్చ చేయగా, ఇప్పుడు నిహారిక కూడా త‌న భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవుల‌లో సాహ‌సాలు చేస్తుంద‌ట‌.

జ‌న‌వ‌రిలో నిహారిక‌-చైత‌న్య జంట మాల్దీవుల‌కి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. అక్క‌డి టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీల‌కు ప‌లు ఆఫ‌ర్స్ ప్ర‌క‌టించ‌గా, నూత‌న దంప‌తుల‌కు కూడా బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తార‌నే టాక్ న‌డుస్తుంది. హ‌నీమూన్ టూర్ పూర్త‌య్యాక నిహారిక త‌ను కమిట్ అయిన సినిమాల‌ని పూర్తి చేయ‌నుంది. తెలుగుతో పాటు త‌మిళ సినిమాల‌లోను న‌టిస్తున్న నిహారిక వెబ్ సిరీస్ కూడా చేయ‌నుంద‌ట‌. మ‌రోవైపు చైత‌న్య కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News