స్కూల్ హోంవర్క్ మాత్రం చేసేదాన్ని కాదు.. అసలు విషయం చెప్పి పరువు తీసుకున్న నిహారిక!

నిహారిక అల్లరి చేష్టలు గురించి మనకు తెలిసింది ఈమె ఎంతో చిలిపిగా అల్లరి పనులు చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత కూడా నిహారికలో ఈ చిలిపితనం పోలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే వివాహమైన తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

తాజాగా నిహారిక ఆస్క్ మీ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు.ఇకపోతే ఈసారి నెటిజన్లకు నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ చెబితేనే తన ప్రశ్న ఏంటో రివీల్ చేస్తానని అలాగే ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెబుతానని తెలియజేశారు. ఈ క్రమంలోనే స్కూల్లో జరిగిన ఒక సంఘటన గురించి ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు నిహారిక తన మొహం కనపడకుండా దాచి పెట్టుకొని సమాధానం చెప్పారు.

స్కూల్లో నిహారిక ఎప్పుడు తన హోం వర్క్ చేసేది కాదని బ్రేక్ సమయంలో తన తల్లి వచ్చి మొత్తం పూర్తి చేసేది అంటూ ఈ సందర్భంగా నిహారిక తన స్కూల్ లైఫ్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం నిహారిక తన స్కూల్ లైఫ్ గురించి చెబుతూ చిన్నప్పుడు చదువు కూడా సరిగా చదువుకోలేదని చెబుతూనే తన పరువు మొత్తం తీసుకుంది.ఈ క్రమంలో నిహారిక తన స్కూల్ డేస్ గురించి చెప్పడంతో పలువురు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ నిహారిక స్కూల్ లో కూడా ఎంత ఇంటిలిజెంటో మనం అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.