‎Tollywood: తొమ్మిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగా డాటర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

‎Tollywood: సినిమా ఇండస్ట్రీలో తరచూ సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాలు విడుదల అయినా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకవేళ సినిమా బాగుండి కలెక్షన్స్ బాగుంటే ఒక నెల ఆలస్యం కావచ్చు. అంతే కానీ ఇదివరకటి రోజుల్లో లాగా 100 రోజులు సినిమా ఆడే రోజులు పోయాయి. ఇప్పుడు ఒక సినిమా ఏకంగా థియేటర్స్ లో విడుదల అయిన 9 ఏళ్ళ తర్వాత ఓటీటీలో విడుదల కాబోతోంది. అప్పట్లో ఆ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

‎ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మరేదో కాదు. మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన ఒక మనసు. యంగ్ హీరో నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. తండ్రి కోసం రాజకీయాల్లోకి రావాలనుకునే సూర్య పాత్రలో నాగశౌర్య, మెడిసిన్ చదివే స్టూడెంట్ సంధ్య పాత్రలో నిహారిక నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.

‎ ఇందులో వీరిద్దరి యాక్టింగ్, కెమిస్ట్రీ జనాలకు తెగ నచ్చేశాయి. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్, బీజీఎమ్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా విడుదల అయిన తొమ్మిదేళ్ల తర్వాత సినిమా విడుదల అవుతుండడం విశేషం.