Niharika konedela : మెగా డాటర్ కొత్త అలవాటు…వైరల్ అయిన వీడియో…!

Niharika konedela :హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై జరిగిన దాడులు ఆ పై అందులో పోలీసుల అదుపులో సెలబ్రిటీలు ఉండడంతో బాగా వైరల్ అయింది. ఇంకా సమయానికి మించి పబ్ నడుపుతుండడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక ఈ పబ్ దాడి లో మెగా డాటర్ నిహరిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్ కుమారుడు, ఇక మాజీ డీజీపీ కూతురు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఈ పబ్ రైడింగ్ లో డ్రగ్స్ కూడా దొరకడం కలకలం రేపింది. ఇక నిహరిక, రాహుల్ సిప్లిగంజ్ మీద ట్రోల్ మొదలైంది. ఇక మెగా డాటర్ నిహరిక కోసం వక్కాంతం పుచ్చుకుని నాగబాబు వెంటనే తన తప్పు ఎమ్ లేదని వివరించే ప్రయత్నం చేసారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇక ఆ తర్వాత కొత్త డైరెక్టర్ సాయి రాజేష్ కూడా పబ్ లో తనతో ఉన్నానని అక్కడ జరిగిన విషయాలను చెప్పి నిహరిక తప్పు చేయలేదని వివరించారు.

ఇక నిహరిక విషయంలో నెగెటివ్ ట్రోలింగ్ ఆగలేదు ఇక నాగబాబు పై విమర్శలు మొదలయ్యాయి. శ్వేతా రెడ్డి, శ్రీ రెడ్డి వంటి వారు ప్రత్యక్షంగానే నాగబాబును ఉద్దేశించి నిహరిక విషయంలో విమర్శించారు. ఇన్ని మలుపులు తిరిగిన నిహరిక ఇష్యూ ఇపుడు మరో న్యూస్ తో వైరల్ అయింది. పబ్ ఇష్యూ తర్వాత మొదరిసారిగా నిహరిక ఫోటోలు సోషల్ మీడియా లో దర్శనమిచ్చాయి. కుండలు తయారుచేస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ మధ్యనే నిహరిక మట్టి పాత్రలు తయారుచేసే కోర్స్ లో చేరిందట. ఇదొక కొత్త హాబీగా నిహరిక చెబుతోంది. అయితే ఈ పాటరీ కీ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.