Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా ఎంతో బిజీగా గడుపుతున్నారు నిహారిక. అయితే ఇదివరకు ఈమె యాంకర్ గాను హీరోయిన్ గాను పలు సినిమాలలో నటించారు అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నిహారికకు 2020 వ సంవత్సరంలో కుటుంబ సభ్యులు జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇలా వెంకట చైతన్య నిహారిక వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పాలి పెళ్లయిన రెండు సంవత్సరాలకి వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత తిరిగి నిహారిక కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే నిహారిక ప్రస్తుతం నిర్మాతగా నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. అయితే ఈమె రెండో పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నిహారిక సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈమె నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను అంటూ ఒక పోస్ట్ చేశారు దీంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. నిహారిక పోస్ట్ ఏదో తేడాగా ఉంది అంటూ తెలుసుకొనే ప్రయత్నం చేశారు.
ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తన అక్క సుస్మితను ఉద్దేశించి చేశారని తెలుస్తోంది. సుస్మిత పుట్టినరోజు సందర్భంగా తన అక్కతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ పార్క్ టైం అమ్మ, ఫుల్ టైం బిగ్ సిస్టర్, ఆల్ టైం బెస్ట్ ఫ్రెండ్ … నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ ఈమె తన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్ట్ చేశారు దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.