సీక్రెట్ చెప్ప‌నంటున్న నిహారిక‌.. అది జోసెఫ్‌కు మాత్ర‌మే తెలుసంటూ పోస్ట్‌

కొణిదెల వార‌మ్మాయి నిహారిక డిసెంబ‌ర్ 9న జొన్న‌ల‌గడ్డ చైత‌న్య‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. హ‌నీమూన్‌కు మాల్దీవుల‌కి వెళ్ల‌డం, అర్ధ‌రాత్రి స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో చక్క‌ర్లు కొట్ట‌డం, మాల్స్‌లో మ‌స్తీ చేయ‌డం ఇలా ప్ర‌తి మూమెంట్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక ఈ మ‌ధ్య రెగ్యుల‌ర్‌గా పోస్ట్‌లు పెడుతూ నెటిజ‌న్స్‌ని క‌న్ఫ్యూజ్ చేస్తుంది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మూతి మీద వేలు వేసుకొని ఉన్న ఫొటో షేర్ చేస్తూ ఆ సీక్రెట్ చెప్పను. అది చెబితే సీక్రెట్ ఎలా అవుతుంది అంటూ కామెంట్ పెట్టింది. అయితే ఆ సీక్రెట్ జోసెఫ్ రాధిక్‌కు ఒక్క‌డికే తెలుస‌ని పేర్కొంది. మ‌రి ఆ జోసెఫ్ ఎవ‌రు అంటే నిహారిక పెళ్లి ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫ‌ర్ . మ‌రి జోసెఫ్‌కు తెలిసి మ‌న‌కు తెలియ‌కుండా ఉన్న ఆ సీక్రెట్ ఏంట‌నేది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిహారిక ప్ర‌స్త‌తం వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇందులో అన‌సూయ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్ లాంచింగ్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా, చైత‌న్య కూడా హాజ‌ర‌య్యారు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొద‌లు కానుంది. మ‌రో వైపు ఇటు తెలుగు అటు త‌మిళంలోను ప‌లు సినిమాలు చేసేందుకు సిద్ద‌మ‌వుతుంది నిహారిక‌. ఏదేమైన కొణిదెల వార‌మ్మాయి ఇటు సినిమాలు అటు సోష‌ల్ మీడియా మ‌రో వైపు వెబ్ సిరీస్‌ల‌తో దుమ్ము రేపుతుంది.