Crime News: ఇటీవల విఏఒ నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. రాజకీయ నాయకుడు వేధింపుల కారణంగానే విఏఓ నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొందరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ నాయకుడు నరసింహారావు వేధింపులు భరించలేక నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడం వల్ల ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ నాయకుడు నరసింహారావు నాగలక్ష్మి లైంగిక వేధింపులకు గురి చేయడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు తెలిపాడు.
నాగలక్ష్మి హత్య కేసు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుండి ఎటువంటి స్పందన రాలేదని, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాసరని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల ప్రాణాలు కంటే రాజకీయ నాయకుల క్షేమం కోసం పని చేసి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ దిగజారి పోయింది అని చంద్రబాబు వెల్లడించారు.
ఈ క్రమంలో నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వాళ్లందరినీ శిక్షించాలని తోటి వీఓఏ లు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.. వీఏవో నాగలక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ నేత గరికపాటి నరసింహారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.