Naga Chaithanya: సినిమాలలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు… షాకింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య!

Naga Chaithanya: హే సినామిక చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా నాగ చైతన్య హాజరయ్యారు. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ తనకు దుల్కర్ సల్మాన్ కు ఉన్న పరిచయం గురించి మాట్లాడారు. చెన్నై లో ఉన్నపుడు దుల్కర్ తో పరిచయమేర్పడిందని సినిమాల గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం అని అసలు సినిమాల్లో నటిస్తామని అనుకోలేదని చెప్పారు. ఇక దుల్కర్ తన నటనతో అన్ని భాషల్లోను అభిమానులను సంపాదించుకున్నాడని అన్నారు.

ఈ చిత్రంలో అధితి రావ్ హైదరీ, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు బృంద మాస్టర్ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయినా టీజర్ అందరిని ఆకట్టుకుంది.
నాగచైతన్య బృంద మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆమే అభిమానిని అని, ఆమే ఎన్నో సినిమా పాటలకు నృత్యరీతులు అందించారాని ఈ సినిమా మంచి విజయ సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. చాలా రోజుల తర్వాత ఈ వేడుక ద్వారా దుల్కర్ సల్మాన్ ను కలిసానని మా మధ్య గ్యాప్ వచ్చిందంటూ పాత జ్ఞాపకాలను ఈ ఈవెంట్ ద్వారా చైతూ పంచుకున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ కురుప్ సినిమాకు మంచి ఆదరణ లభించిందని ఇక ఈ సినిమాను కూడా ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.

ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ఇక ఈ ఈవెంట్ లో బృంద మాస్టర్, నిర్మాత సురేష్ బాబు, జగపతి బాబు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం ద్వారా నాగార్జున తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని చిన్నప్పుడు ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నామని అయితే ఎప్పుడు కూడా సినిమాల్లోకి రావాలని మేము అనుకోలేదు అంటూ వెల్లడించారు ఇలా అనుకోకుండా సినిమాలలోకి వచ్చామని ఆయన ఇక ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.