ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర బ్రాండ్ గా మారిపోయిన పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్కో సినిమాకి అంచనాలు మించి ప్లాన్ చేసుకుంటున్న డార్లింగ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఏకంగా పాన్ ఆసియా ప్రాజెక్ట్ ని భారీ లెవెల్లో ప్లాన్ చేశాడు. మొత్తం 8 భాషల్లో ఈ సినిమాని అనౌన్స్ చెయ్యడంతో ఎనలేని స్థానానికి ఈ చిత్రం వెళ్ళింది.
మరి ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఊహించని గాసిప్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం కొరియా కి చెందిన ఒక స్టార్ హీరోయిన్ ని ప్రభాస్ సరసన అనుకుంటున్నారట. ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. మరి దీనిపై సరైన క్లారిటీ కూడా మీ ముందుకు తీసుకొస్తాం.. ప్రస్తుతం అయితే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది.