చెప్పుల షాపు పెట్టారా అంటూ మంచు లక్ష్మి పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!

మంచు లక్ష్మి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు లక్ష్మి సినిమాల కన్నా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ పెట్టిన భారీగా నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా తమ కుటుంబం గురించి ట్రోలింగ్ చేసేవారికి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చినప్పటికి ట్రోలర్స్ ఏ మాత్రం తగ్గకుండా వీరిపై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే మంచులక్ష్మి తాజాగా తన షూ స్టాండ్ దగ్గర కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

తన ముందు నాలుగైదు జతల షూస్ పెట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎప్పుడు సరైన దొరకదు అంటూ క్యాప్షన్ జోడించి ఈ ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో పై నెటిజన్స్ యధావిధిగా ఈమె పై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే కొందరు ఇన్ని జతల చెప్పులు ఇక్కడ పెట్టుకోకపోతే పేదవారికి దానం చేయవచ్చు కదా అంటూ ఉచిత సలహా ఇచ్చారు.

అదేవిధంగా మరికొందరు ఏంటి చెప్పులు షాప్ పెట్టారా అంటూ కామెంట్ చేయగా మరికొందరు షూ స్మగ్లర్ అంటూ ఈమెపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి మంచు లక్ష్మి ఎలాంటి ఫోటో, వీడియో షేర్ చేసిన ఈమెకు నెటిజన్ల నుంచి ట్రోల్స్ మాత్రం తప్పడం లేదు. ఇక సినిమాల విషయానికొస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.