సింగింగ్ షో లో డాన్స్ తో అదరగొట్టిన అనసూయా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట ఒక న్యూస్ ఛానల్ లో ప్రజెంటర్ గా పని చేసిన అనసూయ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఈ షోలో అనసూయ తన అందంతో , డాన్స్ తో యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ తో పాటు మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్ అనే షో లో కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.

అంతే కాకుండా అనసూయా పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం అనసూయ అరడజనుకు పైగా సినిమాలలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటివరకు అనసూయ నటించిన క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు అనసూయకి చాలా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమాతో పాటు మరొక 6 సినిమాలలో నటిస్తోంది. ఇలా ఒక వైపు టీవీ షోలు మరొకవైపు సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ తన అందాలతో చేసే రచ్చ మామూలుగా ఉండదు.

ప్రతి వారం టీవీ షోస్ కోసం చేసే ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అందంతో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అనసూయ ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఈ అందాల ఆరబోత కారణంగా అనసూయ ఎన్నోసార్లు విమర్శలను కూడా ఎదుర్కొంది. తాజాగా అనసూయ మరొకసారి తన డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో లో అనసూయ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు అంటూ సాగే పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్స్ ఈ డాన్స్ వీడియో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.