Ntr: ఆపరేషన్ సింధూర్… టార్గెట్ గా నిలిచిన ఎన్టీఆర్… మామూలు ట్రోలింగ్ కాదుగా?

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వారసుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా వరుస పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం వార్తలో నిలిచారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఒక్కసారిగా ఇండియాలో పరిస్థితులు మారిపోయాయి. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి సుమారు 27 మందిని చంపేశారు. అది కూడా కులం అడిగిమరీ చంపిన ఘటన అందరిని ఎంతో దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేపట్టిన చర్యలకు ప్రతీకార చర్యలు ఉంటాయని భారత ప్రభుత్వం హెచ్చరించడమే కాకుండా పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న నేపథ్యంలో హిందూ ముస్లింస్ అంటూ పెద్ద ఎత్తున కులమత బేధాలను చూయిస్తున్నారు అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్ సైతం హిందూ కాదని ఆయన ఒక ముస్లిం అంటూ ఒక కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

ఎన్టీఆర్ అసలు పేరు నందమూరి తారక రామారావు కాదని ఆయన అసలు పేరు మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఈయన ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తర్వాతనే తనకంటూ ఎంతో గుర్తింపు రావడమే కాకుండా ఆయన ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అందుకున్నారంటూ ఒక వాదన తెరపైకి రావడంతో ఎంతోమంది ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక ఈ విషయంపై ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోయిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఘాటుగా రియాక్ట్ అవుతూ.. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ పై విమర్శలు చేయడమే కాకుండా ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్ పెడితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామంటూ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.