Balakrishna: యంగ్ హీరోయిన్ తో డాన్స్ ఇరగదీసిన బాలయ్య బాబు.. చండాలమైన డాన్స్ అంటూ మండిపడుతున్న నెటిజన్స్!

Balakrishna: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. కాగా ఇప్పటికే తన గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. డాకు మహారాజ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు పై కొంతమంది నెటిజన్స్ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ సినిమా నుంచి తాజాగా దబిడి దిబిడి అనే పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో 64 ఏళ్ల వయసు ఉన్న బాలయ్య బాబుతో 30 ఏళ్ల వయసు ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా చిందులు వేసింది. అయితే ఎప్పుడూ బాలయ్య బాబు వేసిన స్టెప్పులకు ఈలలు వేయడం తప్ప పేరు పెట్టింది లేదు. కానీ ఈ పాటలో స్టెప్పులు మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి అంటూ కొందరు మండిపడుతున్నారు.

 

పాటలో బాలకృష్ణ డ్యాన్స్‌కు బదులు నటిని కొట్టడమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి డ్యాన్స్‌ పేరుతో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా? అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. తన కూతురి వయసున్న హీరోయిన్‌తో ఇలాంటి నీచమైన స్టెప్పులు వేస్తారా? అని మండిపడుతున్నారు. కొరియోగ్రఫీ దరిద్రంగా ఉందని, డ్యాన్స్‌ పేరుతో ఇంత నీచమైన పనులు చేయిస్తారా? అని దుమ్మెత్తి పోస్తున్నారు. అభిమానులు సైతం దయచేసి ఈ పాటను డిలీట్‌ చేయండంటూ వేడుకుంటున్నారు. మరి ఈ విషయాలపై కామెంట్ లపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.