మరోసారి అడ్డంగా దొరికిపోయిన మల్లెమాల.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారయ్యా!

మల్లెమాల వారి వ్యవహారశైలి ఇప్పుడప్పుడే ఎవరికీ అంతుపట్టని విధంగా మారిపోయింది.మల్లెమాల వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బాగా ఆదరణ లభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాలకు ప్రధానంగా ఉన్న వారిని ఒక్కొక్కరిని బయటికి పంపుతున్నారు.ఇలా కార్యక్రమాలకు పిల్లర్ గా ఉన్నటువంటి వారు బయటకు వెళ్ళిపోవడంతో ఆ కార్యక్రమానికి రేటింగ్స్ తీసుకురావడం కోసం నానా ఇబ్బందులు పడుతూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.ఈ క్రమంలోనే వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల అడ్డంగా దొరికిపోతు నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోలింగ్ గురవుతున్నారు.

ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది యాక్సిడెంట్ చేశారంటూ పోలీసులు తనని తీసుకేళ్లిపోయారు. ఈ క్రమంలోనే కొందరు నిజమేనని ఆందోళన చెందగా మరికొందరు ఇది కూడా రేటింగ్ కోసమే ఇలా చేసి ఉంటారు అంటూ మరికొందరు మల్లెమాల వారి చెత్త ఐడియాల గురించి బయట పెట్టారు.

అయితే అందరూ అనుకున్న విధంగానే కేవలం షో రేటింగ్ కోసమే ఇలాంటి స్కిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఇకపోతే పోలీసులు వచ్చి ఆది యాక్సిడెంట్ చేశారని అందుకే తనని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయితే గత కొన్ని ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది తనకు డ్రైవింగ్ రాదని ఎన్నోసార్లు చెప్పారు. ఇక ఈ విషయం మరిచి పోయిన మల్లెమాల వారు పోలీసుల చేత ఇంత పెద్ద డ్రామా ఆడించారు.ఈ విధంగా ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి ఈ స్క్రిప్ట్ చేయడంతో మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయి ఆది కి డ్రైవింగ్ రాదనే లాజిక్ ఎలా మిస్సయ్యారు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.